Bilva Patra : కార్తీక మాసంలో శివయ్యను ఈ పత్రంతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు..

Updated on: October 26, 2022

Bilva Patra : విష్ణువును అలంకారం ప్రియుడు అని పిలిస్తే.. శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకు అలంకారం కంటే కూడా అభిషేకాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఆకులు, అలమలు, నీళ్లు సహా ఇతర వాటితో చేసే అభిషేకాలు ఆయనకు ప్రీతిపాత్రం. బిల్వ చెట్టు.. దీనిని మారేడు, వెలగ చెట్టు అని కూడా పిలుస్తారు. బిల్వ ఆకులు శివయ్యకు చాలా ఇష్టం.

bilva-patra-do-puja-with-these-leaves-lord-shiva-will-give-blessings
bilva-patra-do-puja-with-these-leaves-lord-shiva-will-give-blessings

ఏరోజు అయినా బిల్వ ఆకులు లేనిదే శివయ్య పూజ పూర్తి కాదు. మారేడు ఆకులు మూడు కలిసి శివుని కళ్లలా కనిపిస్తాయి. అలా మూడు ఆకులు గల బిల్వ ఆకులను పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు. శివుణ్న బిల్వ పత్రాలతో పూజించడం శ్రేష్టం. బిల్వ వృక్షం శివున్ని స్వరూపమని సాక్షాత్తూ దేవతలు భావిస్తారు. శివ పురాణంలో బిల్వ పత్రం విశిష్టత తెలిపే కథ ఉంది.

Bilva Patra : శివుడి అనుగ్రహం కోసం ఇలా పూజించండి.. 

శని దోషం ఉన్న వారు దోషపరిహారార్థం తనను బిల్వ పత్రాలతో పూజిస్తే దోష నివారణ జరుగుతుందని అంటారు. బిల్వ పత్రాలతో పూజించే వారిని శని దేవుడు బాధించడు అని అభయమిచ్చాడని అంటారు. లక్ష్మీ దేవి తపస్సుతో బిల్వ వృక్షం పుట్టిందని చెబుతారు. బిల్వ పత్రాన్ని సోమవారం, మంగళవారం, ఆరుద్ర నక్షత్రం, సంధ్యాసమయం, రాత్రి వేళలో అలాగే శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున బిల్ప పత్రాలను సమర్పించాలి.

Advertisement

Read Also : Arvind Kejriwal : లక్ష్మీదేవి, గణేష్‌ ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలి : అరవింద్ కేజ్రీవాల్

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel