...

RRR Movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పునీత్ అభిమానులు…!

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా
ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో సక్సెస్ ఫుల్ గా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కన్నడ పరిశ్రమలో మాత్రం ఈ సినిమాకు చుక్కెదురయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా పై పునిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ” జేమ్స్” సినిమాని గత వారం విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. పునీత్ నటించిన చివరి సినిమా విడుదలైన మొదటి వారంలోనే దాదాపు 150 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్రేక్ పడేలా చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ చేయడం కోసం కన్నడ లోని దాదాపు అన్ని థియేటర్లలో జేమ్స్ సినిమాను తొలగించారు.

జేమ్స్ సినిమా విజయవంతంగా రన్‌ అవుతున్నా, ఆడియెన్స్ పాజిటివ్‌ టాక్‌ ఉన్నా కూడా కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం థియేటర్లలో ఈ సినిమాను తీసివేయడం గురించి శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ పై పునీత్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఆర్ఆర్ఆర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇతర భాషల సినిమా కోసంసొంత భాష సినిమా ని ఎలా తీసేస్తారు అంటూ పునీత్ రాజ్ కుమార్ ఫిలిం ఛాంబర్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.