...

Jr NTR – Prashanth Neel: ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ ని చూపించిన ప్రశాంత్ నీల్… ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ 31 పోస్టర్!

Jr NTR – Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోవడంతో ఈయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేశారు.

Jr NTR - Prashanth Neel
Jr NTR – Prashanth Neel

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన మోషన్ టీజర్ విడుదల చేశారు.టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై ఇప్పుడే అంచనాలను పెంచుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న 31 వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కేవలం ప్రచారం మాత్రమే అనుకున్నప్పటికీ అధికారికంగా తెలియజేయలేదు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ కళ్ళు కాటుక పెట్టుకొని ఎంతో విభిన్నంగా ఉన్నారు.రక్తంతో తడిచిన నేల ఎప్పటికీ గుర్తుంటుంది. అతని నేల …అతని పాలన.. అతని రక్తం మాత్రం కాదు … అంటూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also :Ravi Teja: వైరల్ అవుతున్న రవితేజ కూతురు ఫొటోస్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా..?