Ravi Teja : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహనటుడిగా కొన్ని సినిమాలలో నటించిన రవితేజ హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, భద్ర, విక్రమార్కుడు, కిక్, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. రవితేజ లాగా మరే హీరో కూడా ఇండస్ట్రీలో కామెడీ చేయలేదు. తనదైన తనదైన శైలిలో మాస్ డైలాగులు చెప్పడం, కామెడీ చేయడంతో రవితేజ మంచి గుర్తింపు పొందాడు.
కొంత కాలం సినిమాలకు దూరమైన రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో ప్రస్తుతం రవితేజ చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవల రవితేజ నటించిన కిలాడి సినిమా కూడా విడుదల అయింది. అయితే రవితేజ ఎప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను బయట పెట్టాడు. సినిమాలతో తప్ప బయట ఎక్కువ కనిపించని రవితేజ కుటుంబసభ్యులను కూడా ఎవరు చూసి ఉండరు.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో రవితేజ కూతురు గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. తొందర్లోనే రవితేజ కూతురు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కూతురుకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు మీ కూతురు చాలా అందంగా ఉంది ఎప్పుడు హీరోయిన్ గా పరిచయం చేస్తారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే 19 సంవత్సరాల వయస్సు గల రవితేజ కూతురికి కూడా సినిమాల పట్ల ఆసక్తి ఉందనీ, అందువల్ల తొందర్లోనే ఆమెను హీరోయిన్ గా రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World