Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 39వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో గత వారం రోజుల నుంచి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు రావడంతో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని కేకులు కట్ చేస్తూ టపాకాయలు కాలుస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. జై ఎన్టీఆర్..తారక్ అన్న బయటికి రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ విధంగా ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసినప్పటికీ తారక్ బయటికి రాలేదు. ఈ క్రమంలోనే ట్రాఫిక్, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులపై లాఠీచార్జి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా అభిమానుల కోసం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తారక్ లేఖ రాస్తూ… క్షమించండి నేను ఇంట్లో లేకపోవడం వల్ల బయటికి రాలేకపోయాను అంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.
క్షమించండి.. నేను ఇంట్లో లేకపోవడం వల్ల మిమ్మల్ని కలవలేక పోయాను. మీ ప్రేమ, మద్దతు ఆశీర్వాదాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేడు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా సహోదరులు, అభిమానులు, సహా నటీనటులు, బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే తారక్ పుట్టిన రోజు కావడంతో తన 30, 31 వసినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.
Read Also : RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World