Petrol price today : మన దేశంలో దాదాపు 45 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది.
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- అలాగే వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.