Systematic Withdrawal Plan : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఎంతోకొంత డబ్బు పెన్షన్ రూపంలో అందుతుంది. ప్రతి నెల 2 లక్షల రూపాయలు పెన్షన్ పొందాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల స్థిర ఆదాయం పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్). ఈ పథకం ద్వారా రిస్క్ లేకుండా ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎన్‌పీఎస్ స్కీమ్ లో చేరాలనుకొనే వారు కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి.
20 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరినవారు 60 ఏళ్లు దాటిన తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే 75 ఏళ్లు వచ్చేవరకు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అయితే మనం తీసుకునే మొత్తంలో కొంత డబ్బు ని యాన్యుటీ స్కీమ్స్‌లో పెన్షన్ కోసం కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ అయిన తర్వాత 60 శాతం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాత యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. అలా చేయటం వల్ల ప్రతి నెలా పెన్షన్ వస్తూనే ఉంటుంది.
అయితే ఈ డబ్బులు ఇన్వెష్ట్ చేయటానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, నిప్పాన్ ఇండియా అసెట్ అలొకేటర్ ఎఫ్ఓఎఫ్, కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ వంటి వాటిల్లో సిస్టమ్యాటివ్ విత్‌డ్రాయెల్ ప్లాన్ కింద డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనం ఇన్వెష్ట్ చేసే డబ్బు బట్టి మెచ్యూరిటీ అమౌంట్ మారుతుంది. అలాగే మనం కొనుగోలు చేసే యాన్యుటీ బట్టి మనకి
పెన్షన్ వస్తుంది. ఉదాహరణకి ఒకవేళ మనం 20 ఏళ్ళ వయసులో ఈ స్కీమ్ లో చేరి 60 ఏళ్ళ దాకా ఇన్వెష్ట్ చేశామని అనుకుందాం. అప్పుడు ఎన్‌పీఎస్ స్కీమ్ కింద 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే రూ. 1.9 కోట్లు మన చేతికి వస్తాయి
అలాగే అప్పుడు మిగిలిన మొత్తం డబ్బు యాన్యుటీ ప్లాన్‌లో పెట్టినప్పుడు ప్రతి నెలా రూ. 64 వేల వరకు పెన్షన్ వస్తుంది. అలాగే మనం విత్‌డ్రా చేసిన రూ. 1.9 కోట్లను సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 1.43 లక్షల వరకు పొందొచ్చు. అంటే ఎన్‌పీఎస్ రూ. 64 వేల పెన్షన్ కి రూ. 1.43 లక్షలు కలుపుకుంటే నెలకు రూ.2 లక్షలు పొందొచ్చు. ఇక్కడ రూ. 64 వేలు మీరు జీవించి ఉన్నంత కాలం వస్తూనే ఉంటుంది. ఇక రూ. 1.43 లక్షలు 25 ఏళ్ల వరకే వస్తాయి.
Read Also : PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం కింద 2 వేలు పొందాలంటే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి …?