PM Kisan Yojana : కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో పథకాలను రూపొందించి ఆ పథకాల ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 6 వేల రూపాయలు రైతులకు అందజేస్తోంది. ఈ క్రమంలో మే 31వ తేదీ 11వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వార దాదాపు 10.5 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 21 వేల కోట్లను జమ చేశారు. అయితే కొంతమంది రైతులకు ఈ డబ్బులు అందకపోవచ్చు. అయితే మరి కొంతమంది అర్హత ఉన్న రైతులకు కూడా డబ్బులను పొందలేకపోతే ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోండి.
సాధారణంగా పీఎం కిసాన్ యోజన కింద వచ్చి 2 వేల రూపాయల డబ్బులు పొందాలంటే కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. అంతే కాకుండా అప్పుడప్పుడు కొన్ని చిన్న పొరపాట్ల వల్ల కూడా ఈ డబ్బులు అందవు. ముఖ్యంగా మనం ఇచ్చిన పిఎం కిసాన్ అప్లికేషన్ లో ఉన్న పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలి. అలా లేని క్రమంలో పేరు మిస్ మ్యాచ్ అయ్యి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాకపోవచ్చు. అందువల్ల ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా పేరుతో పాటు మనం ఇచ్చిన అప్లికేషన్ లో, ఆధార్ కార్డు లో ఒకే అడ్రస్ ఉండేలా చూసుకోవాలి. అడ్రస్ మిస్ మ్యాచ్ అయినా కూడా డబ్బులు అకౌంట్ లో పడవు.
ముఖ్యంగా మనం ఇచ్చిన అప్లికేషన్ లో ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఆధార్ నంబర్ తప్పుగా ఉన్న సందర్భంలో కూడా డబ్బులు అకౌంట్ లో పడవు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇకేవైసీ కచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఇకేవైసీ పెండింగ్‌లో ఉంటే వచ్చే ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు అకౌంట్ లో పడవు. ఇక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కచ్చితంగా అర్హత కలిగి ఉండాలి. అర్హత కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం పీఎం కిసాన్ స్టేటస్ చెకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పీఎం కిసాన్ స్టేటస్ గురించి తెలుసుకోవటానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉండాలి. మన మొబైల్ ఫోన్ కి వచ్చే ఓటిపి నంబర్ ఎంటర్ చేసి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ బెనిఫీషియరీ స్టేటస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
Read Also : PM Tractor Yojana : రైతన్నకు సగం ధరకే ట్రాక్టర్ అందించే పథకం.. ఆ పథకం గురించి ఈ విషయాలు తెల్సుకోండి..!