Intinti Gruhalakshmi: తులసిని మారుస్తున్న ప్రవల్లిక.. కోపంతో రగిలిపోతున్న నందు..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి, తన ఫ్రెండ్ ప్రవల్లిక తో కలిసి బయటకి వెళ్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి నాకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు నేను ప్రతిరోజు ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తాను అని దివ్య చెప్పగా, మరి ప్రతిరోజూ వాకింగ్ కి వెళ్తే మాకు టిఫిన్ ఎవరు చేస్తారు మామ్ అంటూ కోప్పడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు తులసి కి అండగా పరంధామయ్య మాట్లాడుతాడు.

Advertisement

ఇక ఆ తర్వాత తులసి దివ్య రూం లోకి వెళ్లి దివ్య కి నచ్చ చెబుతుంది. ఆ తర్వాత తులసి మాటలు విని దివ్య సంతోషంతో తులసిని హత్తుకుంటుంది. అప్పుడు తులసి నా బంగారు తల్లి నన్ను అర్థం చేసుకుంది అని దివ్యను పోగొడుతుంది.

Advertisement

మరొకవైపు పరంధామయ్య అనసూయ కూర్చుని చెస్ ఆడుతూ ఉంటారు. కాసేపు ఫన్నీగా గొడవ పడుతూ ఉండగా ఇంతలో ప్రవళిక వస్తుంది. ఇంట్లో పరంధామయ్య దంపతులకు చెప్పి తులసి ఒక పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకొని వెళుతుంది. అక్కడ ప్రవళిక తులసి కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేసి అవి తులసి కి ఇచ్చి వెళ్లి ట్రై చేయమని చెబుతుంది.

ఇక ఇచ్చిన డ్రెస్ వేసుకోవడానికి తులసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. చుడీదార్ లో తులసిని చూసి ప్రవలిక వావ్ సూపర్ గుడ్ అంటూ పొగుడుతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ ఓనర్ ప్రేమ్ కు నెల జీతం ఇస్తాడు. రేపటి భాగంలో తులసి, ప్రవళిక బయట పానీపూరి బండి దగ్గర పందెం వేసుకొని మరీ పానీపూరి తింటూ ఉంటారు.

Advertisement

ఈ క్రమంలోనే తులసి ఎక్కువ పానీపూరీలు తిన్నాను నేను గెలిచాను అంటూ గంతులు వేస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన నందు కోప్పడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement