Guppedantha Manasu May 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ప్రేమను రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉండగా సాక్షి ఎదురవుతుంది. అప్పుడు వసు ఉదయాన్నే సాక్షి తనతో ఎగ్జామ్ హాల్ దగ్గర మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. రిషి ని వదిలి దూరంగా వెళ్లకపోతే రిషి పరువు తీస్తానని, ఈ కాలేజ్ పరువు నడిరోడ్డు కి ఈడుస్తాను, తల్లి కొడుకులను విడగొడతాను.

Guppedantha Manasu May 30 Today Episode
నువ్వు రిషి కలిసి దిగిన ఫోటోలను లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాలేజీ గోడలపై అతికీస్తాను అంటూ వదలకు గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది సాక్షి. అప్పుడు సాక్షి మాటలకు వసుధార భయపడుతుంది. ఇక సాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకున్న వసు,రిషి సార్ లైఫ్ లోకి నువ్వు వెళ్ళలేవు అంత ఈజీ కాదు అని ధైర్యంగా మాట్లాడుతుంది. అప్పుడు సాక్షి, వసు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి నువ్వు నన్ను మధ్యలో వదిలేసిన నేను నిన్ను వదలను క్యాబ్ బుక్ చేశాను జాగ్రత్తగా వెళ్ళు అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు సాక్షి నా కారులో డ్రాప్ చేస్తాను అని అనడంతో ఇంతలోనే అక్కడికి క్యాబ్ వస్తుంది.
అప్పుడు సాక్షి చాలా ముందు జాగ్రత్తతో ఉన్నావు అని అనడంతో రిషి సార్ బుక్ చేశాడు అని సాక్షికీ స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది వసు. ఇక కారులో వెళ్తూ రిషి గురించి బాధ పడుతూ ఉంటుంది. ఇక మరొకవైపు దేవయానికి జరిగిన విషయం గురించి సాక్షి వివరించడంతో మొదట షాక్ అయిన దేవయాని ఆ తర్వాత ఆనందపడుతుంది.
ఇంతలో వారిద్దరి మాటలు విన్న ధరణి వెళ్లి ఆ విషయాన్ని జగతి మహేంద్ర లకు చెప్పడంతో వారిద్దరూ కూడా టెన్షన్ పడతారు. అప్పుడు జగతి, వసు కీ కాల్ చేయగా వసు రెండు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేయడంతో జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర రిషి కీ ఫోన్ చేస్తాడు. కానీ రిషి మాత్రం నడి రోడ్డుపై కారు నిలబెట్టి కార్లో నిద్ర పోతూ ఉంటాడు. ఇంతలో ఒకతను వచ్చి కారు తీయండి అని చెప్పడంతో రిషి పక్కకు వెళ్లి కారు ఆపి జరిగిన విషయం గురించి తలుచుకుని బాధ పడతాడు. రేపటి ఎపిసోడ్ లో రిషి ని మహేంద్ర గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయడంతో, కన్న తల్లి చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
సాక్షి మధ్యలో వదిలేసింది ఇప్పుడు కూడా అని మాట్లాడటం స్టాప్ చేయడంతో మహేంద్ర టెన్షన్ పడతాడు. ఆ తర్వాత రిషి మహేంద్ర, ఇద్దరు కలిసి మందు తాగడానికి బార్ కి వెళ్తారు. అక్కడికి వసు వచ్చినట్లు ఊహించుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.