Guppedantha Manasu May 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, విషయం గురించి జగతి,మహేంద్ర లు బాధపడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర లు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దానిని వచ్చి దేవయాని పిలుస్తుంది రమ్మని చెప్పి వెళ్లిపోతుంది. మరొకవైపు రిషి ఇంటికి వస్తూ జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు దేవయాని, జగతి, మహేంద్ర లపై కోప్పడుతుంది.

కొడుకు కొడుకు అని ప్రేమ చూపించడం కాదు జగతి బాధ్యత కూడా ఉండాలి అని అనడంతో జగతి తనదైన శైలిలో దేవయానికీ బుద్ధి చెబుతుంది. ఇక ఆ తర్వాత వారు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రిషి వస్తాడు. అప్పుడు మహేంద్ర, దేవయాని ఏమైంది అని అడుగుతున్నా కూడా రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి పోతాడు.
మరొకవైపు వసుధార కూడా జరిగిన విషయం గురించి తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది. రిషి ఒంటరిగా నిలబడి వసుధార ఎందుకు ఇలా చేసింది. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసు ఫోన్ చేయగా అక్కడికి వచ్చిన మహేంద్ర ఎవరో పొగరు అంటూ కాల్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించగా అప్పుడు రిషి ఫోన్ లాక్కుంటాడు.
అప్పుడు రిషి మౌనంగా ఉండటం తో మహేంద్ర ఏం జరిగిందో చెప్పు అని పదే పదే అడగడంతో, ఈ ప్రిన్స్ ని చిన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది సాక్షి మధ్యలోనే వదిలేసింది ఇప్పుడేమో ఆ అంటూ మాట్లాడటం ఆపేయడంతో అప్పుడు మహేంద్ర ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు రిషి అని గుచ్చి గుచ్చి అడుగుతాడు.
వారి మాటలను వింటున్న జగతి ఆ విషయం గురించి వసుతో మాట్లాడాలి అని బయలుదేరుతుంది. ఆ తర్వాత మహేంద్ర, రిషి ఇద్దరూ కలిసి బార్ కీ వెళ్తాడు. ఎప్పుడూ లేనిది రిషి కొత్తగా బార్ లో కూర్చొని మందు తాగుతూ ఉండడంతో మహేంద్రకు ఏమీ అర్థం కాక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఇంతలో రిషి మందు తాగుతూ ఉండగా అక్కడికి వసుధార వచ్చినట్లు ఊహించుకుంటాడు.
ఆ తర్వాత రిషి వెళ్దాం పదండి డాడ్ నేను పిలిస్తే మీరు ఎలా వచ్చారు అంటూ కామెడీగా మాట్లాడుతాడు. మరొకవైపు జగతి అసలు విషయాన్ని తెలుసుకోవడానికి వసు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఎందుకు వసు రిషి ప్రేమను రిజెక్ట్ చేసావు అని జగతి అడగగా అప్పుడు వసు రిషి సార్ లవ్ చేస్తే నేను కూడా ప్రేమించాలా మేడం అని అనగా అప్పుడు జగతి రిషి గుండెను ముక్కలు చేసావు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu May 30 Today Episode : బాధతో కుమిలిపోతున్న వసుధార..బార్ లో మందు కొడుతున్న రిషి..?