Guppedantha Manasu june 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి, రిషి విషయం గురించి వెళ్ళి వసుని నిలదీస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి, వసు దగ్గరికి వెళ్లి అతని ఏం జరిగింది చెప్పు అంటూ నిలదీస్తుంది. రిషి ఎందుకు అలా ఉన్నాడు.. నువ్వు కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేయలేదు అని జగతి అడగగా అప్పుడు వసు చెప్పడానికి తడబడుతుంది. ఇంతలోనే మహేంద్ర జగతికి రిషి మందు తాగుతున్న ఫోటోని పంపించడంతో ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది జగతి.
ఆ ఫోటోని వసు కూడా చూపించడంతో వసుధారా కూడా షాక్ అవుతుంది. కాలేజీకి వెళ్లాల్సిన నా కొడుకు ఇలా బార్ కి ఎందుకు వెళ్తున్నాడు నిజం చెప్పు రిషి తల్లిగా అడుగుతున్నాను అని జగతి ఎంత గట్టిగా నిలదీసిన కూడా వసుధార ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
అప్పుడు జగతి సీరియస్ గా ప్రశ్నించడంతో రిషి సార్ తనని ప్రేమిస్తున్నాడని అనడంతో ఆ మాటకు జగతి షాక్ అవుతుంది. ఆ తర్వాత వసుధార జరిగింది మొత్తం జగతికి వివరిస్తుంది. అప్పుడు జగతి ఎందుకు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది. అప్పుడు వసుధార రిషి సార్ తనను ప్రేమిస్తే నేను ప్రేమించాలి అని రూల్ లేదు కదా మేడం అంటూ తన జీవిత లక్ష్యం గురించి మాట్లాడుతుంది.
అప్పుడు జగతి నేను వదిలి వెళ్ళినప్పుడు రిషి ఎంత బాధ పడ్డాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ నువ్వు బాధ పెట్టావు రిషి మనసు ముక్కలు చేసావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి. మరొకవైపు మహేంద్ర, రిషిని కాలేజ్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడు మహేంద్ర ఏం జరిగిందో చెప్పు అని నిలదీయగా రిషి తనదైన శైలిలో కొద్దిసేపు మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
మరొకవైపు ధరణి గౌతమ్ ను ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర కోసం జగతి వస్తుంది. ఇంతలోనే మహేంద్ర రావడంతో మహేంద్ర తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది జగతి. ఇక వసుధారా జరిగిన విషయాన్ని తలచుకొని బాధపడుతూ కాలేజ్ దగ్గరికి వస్తుంది. రిషి క్లాస్ చెబుతూ ఉండగా లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది వసు. వసు వాయిస్ విన్న రిషి కోపంతో రగిలి పోతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu May 31 Today Episode : బాధతో కుమిలిపోతున్న రిషి.. వసుని నిలదీసిన జగతి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World