...

Mahesh Babu: అభిమానుల కోసం మొదటిసారిగా మాస్ స్టెప్పులు వేసిన మహేష్ బాబు..!

Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి సినిమా గురించి నెగిటివ్ కామెంట్ చేశారు. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సోమవారం రాత్రి కర్నూలు STBC కాలేజ్ గ్రౌండ్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి. సర్కారు వారి పాట సినిమా యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా ను మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఒక్కడు సినిమా సమయంలో కర్నూల్ కి వచ్చాను. మరీ ఇన్ని సంవత్సరాల తర్వాత సర్కారు వారి పాట సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సెలబ్రేషన్స్ కర్నూల్ లో చేద్దామని మా యూనిట్ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. మీలాంటి అభిమానులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని మహేష్ బాబూ చెప్పుకొచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో తమన్ మ మ మహేష్ అనే పాటకి డాన్స్ చేస్తూ మధ్యలో మహేశ్ బాబు ని కూడ స్టేజ్ మీదకి రమ్మని కోరాడు. వెంటనే మహేశ్ బాబు స్టేజి మీదకు వెళ్ళి తమన్ తో కలిసి మ మ మహేష్ అనే పాటకి మాస్ స్టెప్పు వేసాడు. మహేశ్ బాబు మొదటిసారి తన అభిమానుల కోసం స్టేజి మీద డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.