...

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… కొత్త మూవీ స్టార్ట్ !

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈరోజు ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈ మూవీ ఈ సంస్థలో రూపొందుతున్న ఏడో చిత్రం. అలానే మహేష్ బాబు కెరీర్ లో 28 వ చిత్రం.

ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు నిర్మాత చినబాబు తెలిపారు. గతంలో మహేష్ – పూజా హెగ్డే ‘మహర్షి’ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇది వారిద్దరికి రెండో సినిమా. ఇక అదే విధంగా ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఇది మూడో సినిమాగా రానుంది.

సుమారు పన్నెండేళ్ల విరామం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రమే కాదు… త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని – పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని – తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’ చేశారు పూజా హెగ్డే. ఆ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు.

Read Also : Devotional News : ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు సమస్య ఉంటుందా… అయితే ఇవి పాటించండి !