Guppedantha Manasu : రిషి, దేవయానిలు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే!

Guppedantha Manasu Feb 7 Episode
Guppedantha Manasu Feb 7 Episode

Guppedantha Manasu Feb 7 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి మహేంద్ర ను సరదాగా పాట పాడమంటూ టార్గెట్ చేస్తారు. కానీ మహేంద్ర ఆ విషయాన్ని పిండి వంటలు వైపు డైవర్ట్ చేస్తాడు.

what-did-mahendra-do-when-he-heard-the-rishi-and-devyani-words
what-did-mahendra-do-when-he-heard-the-rishi-and-devyani-words

ఈలోపు అక్కడికి రిషి వస్తాడు. అక్కడ అందరినీ చూసి.. అందరూ ఇక్కడ ఉంటే పెద్దమ్మ ఒక్కతే రూమ్ లో ఏం చేస్తుంది అని తన పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇక ఏమైంది పెద్దమ్మ అని అడగగా.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోతాను, నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని కపట ప్రేమతో ఏడస్తుంది. దాంతో రిషి మరి నేనెవరిని పెద్దమ్మా..అని అడుగుతాడు.

Advertisement

ఆ మాటకు దేవయాని నువ్వు మారిపోయావు రిషి అంటూ ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఈ ఇల్లు నాది కాదేమో.. నువ్వు నా కొడుకువి కాదేమో అని అనిపిస్తుంది రిషి అంటూ ఏడుస్తుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకునే విషయాన్ని మహేంద్ర ఒక దగ్గర ఉండి గమనిస్తాడు. దేవయాని మాటలకు రిషి బాగా ఎమోషనల్ అవుతాడు.

అలా దేవయాని మాటలకు పడిపోయిన రిషి దేవయానిని దగ్గరికి తీసుకుని మిమ్మల్ని ఎక్కడికీ వెళ్లనివ్వను పెద్దమ్మా అని ఎమోషనల్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్న మహేంద్ర వెంటనే జగతి దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని చెబుతాడు. అలా చెప్పి జగతిను ఇంటి నుంచి పంపడానికి లగేజ్ బ్యాగ్ సిద్ధం చేస్తాడు.

Advertisement

ఇక మహేంద్ర, లగేజ్ బ్యాగ్ తో పాటు జగతి తో కలిసి రిషి దగ్గరకు వస్తాడు. రిషి, దేవయాని మాట్లాకున్న విషయం గురించి మహేంద్ర కు తెలిసినట్టుగా రిషి కి అర్థమయ్యేలా డబల్ మీనింగ్ లో చెబుతాడు. ఇక జగతి ఇంటి నుంచి వెళ్లి పోతున్న విషయం తెలిసి ఫ్యామిలీ అంతా బాధ పడతారు.

కానీ దేవయాని మాత్రం ఏమీ తెలియనట్లు జగతిని ఇంటి నుంచి వెళ్లి పోవడానికి కారణం అడుగుతుంది. ఈ క్రమంలోనే మహేంద్ర.. జగతి ఈ ఇంట్లోకి వచ్చినందుకు, వచ్చేలా చేసిన వాళ్ళకి థాంక్స్ అని రిషి కు అర్థమయ్యేలా చెబుతాడు. ఈ క్రమంలో జగతి ఇంటి నుంచి వెళ్లి పోతుందో.. లేదో తెలియాలి అంటే రేపటి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Read Also : Karthika Deepam: ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!

Advertisement