Guppedantha Manasu Feb 8 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటినుంచి బయటికి వెళ్తున్న క్రమంలో తన మనసులోని మాటను అందరి ముందు పణింద్ర ఇలా బయట పెట్టాడు.
‘చూడమ్మా ఈ ఇల్లు నీది.. ఇందులో అందరికీ ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది అని పణింద్ర జగతి తో అంటాడు. ఆ మాటతో దేవయాని షాక్ అవుతుంది. గజతి దగ్గరికి ధరణి వచ్చి పసుపు బొట్టు పెడుతూ ఉండగా అది పెద్దమ్మ పెడితే బావుంటుంది అని రిషి అంటాడు. ఇక దాంతో పణింద్ర దేవయానితో పసుపు బొట్టును జగతి చేతిలో పెట్టిస్తాడు. ఇక దేవయాని ఇష్టం లేకుండా పెడుతుంది.
ఆ తర్వాత పణింద్ర ‘ఈ ఇల్లు నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుందమ్మా’ అని జగతి తో అంటాడు. అంతేకాకుండా ‘ ఎవరు అవునన్నా..ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే’ అని పణింద్ర అందరికి అర్ధమయ్యేలా గట్టిగా చెబుతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర లు పణింద్ర దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. జగతి మహేంద్ర లు కారు వరకు వెళతారు.
ఇక కార్ దగ్గర మహేంద్ర ‘జగతి నువ్వంటేనేనే.. నేనంటే నువ్వే నీ గౌరవమే నా గౌరవం నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను’ అని జగతితో అంటాడు. ఇక అక్కడినుంచి మహేంద్ర జగతిని ఇంటికి తీసుకు వస్తాడు. తనతో పాటు మహేంద్ర కూడా ఇంటికి వచ్చినందుకు జగతి ఎంతో ఆనందపడుతుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర ‘ నన్ను క్షమించు జగతి నా భార్యకు గౌరవం లేని చోట నేను ఉండలేను’ అని చెబుతాడు. ఆ మాటకు జగతి ఎంతో ఎమోషనల్ అవుతుంది. మరోవైపు దేవయాని, ధరణి ఏడుస్తుండగా వెటకారంగా మా అందరి కోసం స్వీట్స్ తయారు చెయ్యి అని చెబుతుంది.
ఆ తర్వాత ధరణి తో రిషి ‘ వదిన నువ్వు ఎందుకు అంత డల్ గా ఉన్నావ్’ అని అడుగుతాడు. అనుకోకుండా ఒక సంతోషాన్ని మిస్ అయితే అలానే ఉంటుంది అన్నట్లు చెబుతుంది. ఇక మరోవైపు మహేంద్ర ‘ జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి’ అని అంటాడు. అంతే కాకుండా రిషి, జగతిను అమ్మగా కూడా గుర్తించాలి అని అంటాడు. ఈ లోపు జగతి వాళ్ళ ఇంటికి రిషి వస్తాడు మరి రిషి ఎందుకు వచ్చాడో తెలియాలంటే రేపటి భాగం కోసం వేచి చూడాల్సి ఉంది.
Read Also : Karthika Deepam : హిమను ఎత్తుకు వెళ్ళిన రుద్రాణి.. అది తెలిసి రుద్రాణి ఇంటికి వచ్చిన సౌందర్య!
Tufan9 Telugu News And Updates Breaking News All over World