Lpg Cylinder Prices : అన్నింటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటీ రెండూ కాదు ప్రతి దాని ధర పైపైకి ఎగబాకుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అన్నింటి ధరలు పెరుగుతాయని చాలా మంది భావించారు. అందరూ అనుకున్నట్లుగానే, విపక్షాలు విమర్శలు చేసినట్లుగానే ధరల మోత మోగుతోంది. పెట్రోల్ రేట్ల నుండి గ్యాస్ వరకూ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. పెట్రోల్ ధరలను రోజూ పెంచుతూనే ఉన్నారు. వారం రోజుల్లో రూ.9 లు పెంచారు. అదే గ్యాస్ విషయంలో ఆ పెరుగుదల భారీగానే ఉంది. ఇంట్లో వాడే సిలిండర్ వెయ్యి రూపాయలు దాటింది.
ప్రస్తుతం ఇంట్లో వాడే గ్యాస్ ధర 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1002 ఉంది. రెండు మూడు రోజుల క్రితమే దీని ధరలు రూ.50 పెంచారు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. అయితే ఇప్పుడు వాణిజ్ వినియోగ సిలిండర్ గ్యాస్ ధరల వంతు.
వాణిజ్య వినియోగ సిలిండర్ ధరను మాత్రం చమురు సంస్థలు భారీగా పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై అసాధారణంగా రూ.273.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.2,460కి చేరింది. అయితే ఇంతకు ముందు అంటే నిన్నటి వరకు రూ. 2,186గా వాణిజ్య సిలిండర్ ధర ఉండేది.
Read Also : Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!