...

Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణ సమయం మరింత తగ్గనున్నట్లు మెట్రో కమిషనర్ ఎండీ తెలిపారు. ఈరోజు నుంచి మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేగం కంటే మరో 10 కిలో మీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి లభించింది. గత నెలలో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు భాగ్య నగర మెట్రో రైళ్లను పరిశీలించారు. రైళ్ల వేగం, భద్రతను గురించి అధికారులను ఆరా తీశారు. వేగం పెంచడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుందని మెట్రో అధికారులు తెలిపారు.

అయితే గతంలో కంటే నాగోల్ -రాయదుర్గంకు 6 నిమిషాలు, మియపూర్-ఎల్బీనగర్ కు 4 నిమిషాలు, జేబీఎస్ -ఎంజీబీఎస్ కు ఒక నిమిషం ప్రయాణ సమయం ఆదా కానుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తుండగా.. తాజా నిర్ణయంతో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి స్టేషన్ వద్ద ఆగడంతో ఈ వేగం ఓవరాల్​గా కొంత వరకు తగ్గనుంది.

Read Also : Niharika in pub case: బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!