Petrol Price : గత పది రోజుల నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం పది రోజుల్లోనే 9 సార్లు పెరిగాయి. అయితే నిన్న దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07కి పెరిగింది. అయితే ఈరోజు ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకడపోవడం సామాన్య ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే అంశమే. అదే విధంగా చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 107.45, డీజిల్ ధర రూ.97.52గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.96.22కి అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలోని హైదరాబాద్లో నిన్న పెరిగిన ధరల అనంతరం లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్లో లీటర్ పెట్రోల్ రూ.116.39 డీజిల్ రూ.102.20కి చేరింది. అలాగే విశాఖ పట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.42, డీజిల్ రేటు రూ.101.27 వద్ద స్థిరంగా సాగుతోంది.
Read Also : Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతో తెలుసా?