Petrol Prices Today : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గడిచిన 13 రోజుల్లోనే 11 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.103.41కు చేరగా.. డీజిల్ ధర రూ.94.67కు పెరిగింది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.118.41కు ఎగబాకింది. లీటర్ డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.102.64కు చేరుకుంది. 75 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108.96కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.99.04కు ఎగబాకింది. అలాగే కోల్ కతాలో లీటర్ పెట్రోల్ 84 పైసలు.. డీజిల్ 84 పైసలు పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రూ.113.033గా ఉంది. డీజిల్ లీటర్ ధర రూ. 97.82కి చేరింది.
- అంతే కాదండోయ్ తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్ ధరపై 87 పైసలను పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో భాగ్య నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.21కు చేరింది. డీజిల్ ధర రూ.103.3కు ఎగబాకింది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరగగా.. రూ.119.07కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.104.78కు చేరుకుంది.
- వైజాగ్‌లో 88 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.117.79కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.103.54కు ఎగబాకింది.
Read Also : Petrol prices today: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతో తెలుసా?