Petrol Prices Today : మళ్లీ పెట్రో బాదుడు.. తగ్గేదెలే అంటున్న చమురు సంస్థలు!

Updated on: April 5, 2022

Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సామాన్య ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల చొప్పున పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో పెట్రోల్ ధర రూ.104.61కు చేరగా.. డీజిల్ ధర రూ.95.87కు పెరిగింది.

ముంబయిలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.119.67కు ఎగబాకింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.103.92కు చేరుకుంది. 76 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110.08కగా మారింది. అలాగే లీటర్ డీజిల్ ధర 76 పైసలు పెరిగి రూ.100.16కు ఎగబాకింది. కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 83 పైసలు, డీజిల్​పై 80పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114.26గా ఉంది. డీజిల్ ధర రూ.99.01కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 91 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరనూ 87 పైసలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.57కు చేరింది. డీజిల్ ధర రూ.104.62కు ఎగబాకింది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 88 పైసలతో.. పెట్రోల్ ధర రూ.120.39కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.106.04కు చేరుకుంది. వైజాగ్​లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.1కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.104.79కు ఎగబాకింది.

Advertisement

Read Also : Entrance Exams Schedule : ఈ సంవత్సరంలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel