...

Kothagudem Raja Ravindra: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి గెల్చిన కొత్తగూడెం పోలీస్..!

Kothagudem Raja Ravindra : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షోలో భద్రాది కొత్తగూడెం పోలీసు అధికారి విజేతగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీఐడీ సైబర్ క్రైమ్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజా రవీంద్ర కోటి గెల్చుకుని చరిత్ర సృష్టించారు. ఈ గేమ్ షోలో కోటి గెలవడం అనేది ఒక కల.. అలాంటి కలను అక్షరాల నిజం చేసి చూపించారు రాజా రవీంద్ర. కోటి దగ్గరకు వెళ్లడం అంత ఈజీ కాదు.చాలామంది కంటెస్టెంట్‌లు లక్షల రూపాయల వద్ద ఆగి చేతులేత్తేశారు. కానీ, ఈ గేమ్ షోలో మొదటిసారిగా ఒక కంటెస్టెంట్ కోటి గెల్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. తెలుగు గేమ్ షోలో కోటి గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా కొత్త చ‌రిత్ర సృష్టించారు రాజా రవీంద్ర. స‌బ్ ఇన్‌స్పెక్టర్ బి.రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్నారు.

ఆయన ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు సులవుగా చెప్పేశారు. అక్షరాల కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. అయితే ఈ విషయాన్ని జెమినీ టీవీ ఒక ప్రక‌ట‌న‌లో వెల్లడించింది. పోలీసు అధికారి రాజారవీంద్ర కోటి ప్రైజ్ మ‌నీ గెల్చుకున్న ఎపిసోడ్ రాత్రి 8.30 గంట‌ల‌కు ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. సోమవారం ఎపిసోడ్ సగం వరకు నడిచింది. మిగతా ఎపిసోడ్ మంగళవారం రాత్రి కూడా ప్రసారం కానుంది.

Read Also : Karthika Deepam Serial : అయ్యోయ్యో వంటలక్క… పరిస్థితి చేయిజారుతోందా? పడిపోతున్న రేటింగ్ దేనికి సంకేతం.. 

ఖమ్మం సుజాతనగర్‌‌కు చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్‌.ఎస్‌ రాజు, శేషుకుమారి దంపతుల కుమారుడు భాస్కర్‌ రాజా రవీంద్ర.. పోలీస్ కాంపిటిష‌న్స్‌లో ఇప్పటికే రవీంద్రకు పలు జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ ప‌త‌కం గెలవాలనేది తన కలగా రవీంద్ర తెలిపారు. ఎవ‌రు మీలో కోట్వీరుడు గేమ్ షో ద్వారా గెల్చుకున్న కోటిని త‌న క‌ల‌ నెరవేర్చుకునేందుకు వినియోగించుకుంటానని తెలిపారు.

2000 నుంచి 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్‌ సుల్తాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో రవీంద్ర బీటెక్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేశారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2019లో జరిగిన ఆలిండియా పోలీస్‌ పిస్టల్‌ విభాగం పోటీల్లో రజతం సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్‌ కార్తికేయ, కుమార్తె కృతి హన్విక ఉన్నారు.

Read Also : Telugu Heroes Remuneration : మన స్టార్ హీరోల పారితోషకం వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!