Karthika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. మోనిత ఏం చేయనుంది..?

Karthika Deepam Mar 3 Today Episode
Karthika Deepam Mar 3 Today Episode

Karthika Deepam Mar 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప బస్తి కి వెళ్లి అక్కడ మోనిత చెంప చెల్లుమనిపించి, అడ్డదారిలో బిడ్డను కన్నావు. పిచ్చిపిచ్చిగా వాగితే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది.

Karthika Deepam Mar 3 Today Episode
Karthika Deepam Mar 3 Today Episode

అలా దీప, మోనిత ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. అనంతరం మోనిత నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు ఆనంద్ విషయంలో కార్తీక్ బాధ పడుతూ ఉండగా సౌందర్య వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీప బస్తి లో జరిగిన విషయాన్ని సౌందర్య, ఆనంద్ రావు లకు చెప్పుకొని బాధపడుతుంది.

Advertisement

ఆ తరువాత సౌందర్య బస్తి కి వెళ్లి మా దగ్గర పెరుగుతున్న ఆనంద్ ని దత్తత ఇవ్వాలి అనుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి అంటూ బస్తీవాసులను ఇన్వైట్ చేస్తుంది సౌందర్య. ఆ తర్వాత సౌందర్య గుడిలో పూజా కార్యక్రమం గురించి కార్తీక్ కి చెబుతుంది. లక్ష్మణ్ ద్వారా దత్తత కార్యక్రమం గురించి తెలుసుకున్న మోనిత మొదట షాక్ అవుతుంది.

Karthika Deepam Mar 3 Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఇదే..

ఆ తరువాత ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తా అంటూ కార్తీక్, సౌందర్య లపై కోప్పడుతుంది. మరొకవైపు దత్తత కార్యక్రమానికి సంబంధించిన ఆమె పనులు గుడిలో పూర్తి అయ్యాయి. ఇక ఈ కార్యక్రమానికి బస్తీ వాళ్ళు ఎందుకు వచ్చారు అని కార్తీక్ సౌందర్యని ప్రశ్నిస్తాడు. అప్పుడు సౌందర్య నేనే రమ్మని పిలిచాను అని చెబుతుంది.

Advertisement

ఇక కార్తీక్, దీపా పూజ లో కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన మౌనిక ఆపండి అని అంటుంది. బాబును దత్తత ఇవ్వడం ఏంటి కార్తీక్ అని అడగగా. అప్పుడు సౌందర్య కార్తీక్ కి చెబుతుంది. అలా మొత్తానికి దత్తత కార్యక్రమం పూర్తి అవుతుంది. మరోవైపు హిమ తనకు తమ్ముడు కావాలి అంటూ ఏడుస్తూ అందరిపై కోప్పడుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam : బస్తీలో చీరలు పంచుతున్న మోనిత.. చెంప చెళ్లుమనిపించిన దీప..?

Advertisement