...

Friday remedy: ఐదే ఐదు నిమిషాలు ఈరోజు పూజ చేయండి.. సకల దరిద్రాలు తొలగిపోతాయి!

Friday remedy: శుక్రవారం రోజు లక్ష్మీ దేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఎలాంటి కష్టాన్నైనా సులభంగా తప్పించుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీ దేవిని ఇంటికి రప్పించుకోవచ్చు అయితే ఈరోజు శుక్రవారంతో పాటు ఏకాదశి తిథి ఉంది. అందుకే సింహ ద్వారం వద్ద ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరఘోష నుంచి బయటపడొచ్చు. ఉదయం లేవగానే శుచి, శుభ్రతతో అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. దీపంలో లవంగం వేయడం వల్ల కష్టాల నుంచి దూరం కావచ్చు.

అలాగే ఉదయమే ఇంటి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పసుపు, కుంకుమలతో కబేర ముగ్గు వేస్కొవాలి. అలా ఉంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఇంటి గుమ్మానికి ఎన్ని రంగులు వేసుకున్నా పసుపు రాసి కుంకుమ పెడ్తే వచ్చే అందమే వేరు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో… ఓ మట్టి ప్రమిద, రెండు లవంగాలు, రెండు యాలకులు, బెల్లం తీస్కోవాలి. మట్టి ప్రమదలో దీపం పెట్టి యాలకులు, లవంగాలు, బెల్లాన్ని అందులో వేయాలి. అలా చేయడం వల్ల అద్బుతమైన ఫలితం ఉంటుందట. ఆ దీపం కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి చెడు వెళ్లిపోతుందట. అయితే మీరు ఈరోజు ఓ సారి ట్రై చేసి.. అదృష్ట లక్ష్మిని ఇంటికి ఆహ్వానించండి.