Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Zodiac Signs : మిథున రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Zodiac Signs : మే నెల 2022లో మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువు, శని సంచారం వల్ల చాలా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు

By Vinod Kumar

Published on: May 6, 2022 6:00 AM

Updated on: May 6, 2022 5:53 AM

---Advertisement---

Zodiac Signs : మే నెల 2022లో మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువు, శని సంచారం వల్ల చాలా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే పాత బకాయిలు, పాత అప్పలన్నీ ఈ నెలలో వసూలు అవుతాయి. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ వీటి వల్ల మీరు చాలా లాభపడతారు. ఆర్థిక విషయాల్లో చక్కగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్లు కచ్చితంగా విదేశాలకు వెళ్లే యోగం కనిపిస్తోంది. అది చదువు కోసమైనా, వ్యాపారం, ఉద్యోగం కోసమైనా ఆ ప్రయత్నాలు పలిస్తున్నాయి.

Gemini zodaic sign results in may month 2022

Advertisement

సంతానం కోసం చాలా రోజులుగా వేచి చూసే వాళ్లు ఈ నెలలో గుడ్ న్యూస్ వింటారు. అలాగే ఈ నెలలో సంతానం కోసం ప్రయత్నించడం చాలా మంచిది. అంతే కాకుండా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ల ఈ నెలలో ప్రయత్నిస్తే చక్కటి సంబంధం కుదురుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులకు ఇది చక్కటి సమయం. నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే పెద్ద పెద్ద గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.