Devatha june 1 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య, కమల ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సత్య, కమల దగ్గరికి వచ్చి బయటకు వెళ్తున్నాను అని చెప్పగా ఆ విషయం ఆదిత్యకు చెప్పు అని అంటుంది సత్య. అప్పుడు కమల తనని చూసి సత్య బాధ పడుతుందేమో అని తన ఇంటికి పోవాలి అని అనుకుంటుంది. కానీ సత్య మాత్రం అలా ఏం కాదు నువ్వు ఇక్కడ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటుంది.

మరొకవైపు జానకి, రామూర్తితో మాట్లాడుతూ రాధ ప్రవర్తన ఏమీ బాగోలేదు అని అంటుంది. మాధవ కు రాధ అంటే ఇష్టం అని తెలిసి కూడా రాధ బయట బంధం చూసింది అని కోప్పడుతుంది. అప్పుడు రామ్మూర్తి అందులో రాద తప్పులేదు కదా తను మొదటి నుంచి అలాగే ఉంది, కాని రాధను మనం కోడలిగా చేసుకోవడం స్వార్థం అవుతుంది అని అంటాడు.
మరొకవైపు సత్య బయటికి వెళ్లిన విషయాన్ని ఆదిత్య తో కమల చెబుతుంది. ఆదిత్య ఒక చోట కూర్చొని రాధ ని తలుచుకుంటూ దేవి ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు. ఇక జానకీ మాటలు విన్న రాధ కోపంతో కనిపిస్తుంది ఇంతలో అక్కడికి సత్య రావడంతో కొద్దిసేపు సత్యతో మాట్లాడుతుంది. అప్పుడు సత్య తనకు జీవితంలో అమ్మ అయ్యే అదృష్టం లేదు అని చెప్పడంతో రాధ బాధ పడుతుంది.
అప్పుడు సత్యకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతుంది. ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండమని చెబుతూ తన మనసులో నా బిడ్డ నీ బిడ్డనే అని తొందర్లోనే కలుస్తాము అని అనుకుంటుంది రాధ. మరొక వైపు భాగ్యమ్మ తన కూతుళ్ల పరిస్థితి తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. రాధా వంటగదిలో ఉండగా అక్కడికి చిన్మయి వచ్చి ఎందుకు అలా ఉంటున్నావు అని అడగగా రాదా ఏమీ లేదు అని సర్ది చెబుతుంది.
ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అనుకుంటే నీతో నా అనుబంధం మరింత బలంగా ఉంది అని బాధపడుతుంది రాధ. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య రాధ ఇంటికి వెళ్లిన విషయాన్ని ఆదిత్యతో చెప్పడంతో అప్పుడు ఆదిత్య రాధా మీ అక్క రుక్మిణి అని తెలిసి వెళ్ళావు కదా అని అనడంతో సత్య అవుతుంది. ఆ విషయం తనకు కూడా తెలుసు అని ఆదిత్య అనడంతో మరింత షాక్ అవుతుంది సత్య. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha May 31 Today Episode : మాధవకు పెళ్లిచూపులు ఏర్పాటుచేసిన రాధ.. ఆనందంలో ఆదిత్య..?