Singer kk passed away: సినీ పరిశ్రమలో విషాదం… గాయకుడు కేకే హఠాన్మరణం

Singer kk passed away: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే ఆకస్మికంగా మృతి చెందారు. కేకే పేరుతో ప్రసిద్ధి గాంచిన కృష్ణకుమార్ కున్నాథ్ కోల్ కతాలోని ఓ హోటల్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆయనను నగరంలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కేకే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకే చనిపోవడానికి ముందు తను ప్రదర్శన ఇస్తున్న పోస్టులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

అయితే కేకే గత మూడు దశాబ్దాలుగా హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. కేకే మృతి విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులందరూ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. కేకే అభిమానులు అయితే కన్నీరుమున్నీరు అవుతున్నారు. కేకే పాటలు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఉండేవి.


“కేకే పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆయన పాడిన పాటలతో కేకే ప్పటికీ గుర్తుంటారు. కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

Advertisement