No muhurthalu: జంటలకు వివాహం జరిపించాలన్నా, నూతన గృహ ప్రవేశం చేయాలన్నా, ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా కచ్చితంగా మంచి ముహూర్తం కావాల్సిందే. అయితే మంచి రోజు లేకపోతే మనం ఎలాంటి పనిని అయినా అస్సలే ప్రారంభించం. కరోనా అనంతరం రెండేళ్ల తర్వాత పెళ్లి మంత్రాలు మారుమోగుతూ ఉన్నాయి. తమ పిల్లల వివాహాలు చేసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముహూర్తాలు ఎక్కువగా లేనందున ఉ్న రోజుల్లోనే త్వర త్వరగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కరోనాతో వరుసగా రెండేళ్ల పాటు దెబ్బతిన్న వ్యాపారాలు వివాహాల వల్ల ఊపందుకున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు వివాహాలు వేల సంఖ్యలో జరిగాయి.
కానీ ఈ నెల దాటితే మళ్లీ ఆ వ్యాపారాలన్నీ మూగబోతాయి. అందుకు కారణం డిసెంబర్ వరకు మళ్లీ మంచి ముహూర్తాలు లేకపోవడమే. ఈ నెలలో 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జూలైలో ఆషాఢ మాసం ప్రారంభం కావడంలో శుభ మహూర్తాలు లేవు. ఆగస్టులో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబరులో భాద్రపద మాసం, శుక్ర మాఢమి ప్రారంభంలో ముహూర్తాలు లేవు. అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్ర మాఢమితో మంచి రోజులు లేవు. డిసెంబర్ 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.