Horoscope: 2022b సంవత్సరం జూన్ నెలలో మిథున రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేస్, వాహన, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ధనయోగం అధికంగా కనిపిస్తోంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి లోన్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో చుట్టరికం ఉన్న వారితోనే పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా పెడ్తే… చాలా లాభాలను పొందుతారు. కాబట్టి పెట్టబడులు పెట్టే ముందు కాస్త ముందూ వెనకా ఆలోచించి నిర్ణయాలు తీస్కోవాలి. అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు, క్రియేటివ్ రంగానికి సంబంధించిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే సోదర సోదరీమణులతో కొన్ని గొడవలు.. వారి కోసం డబ్బు ఖర్చు చేయడం వంటివి జరగబోతున్నాయి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అలాగే వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోని హాయిగా ఉండాలంటే గణపతి, వేంకటేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది.