Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ యొగం ఉంది. వాహనాలు, వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదండోయ్ ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, భూములు కూడా మీుకు దక్కుతాయి. అలాగే ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో విదేశీ ధన యోగం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు అనేక మైన లాభాలు కల్గబోతున్నాయి.
కాకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నెలలో కచ్చితంగా శుభవార్త వింటారు. వివాహాల కోసం ప్రయత్నించే వారికి కచ్చితంగా ఈ నెలలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అప్పులు ఇచ్చేటప్పపుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాదండోయ్.. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో… దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిత్యం లలితా సహస్ర నామాలతో పాటు విష్ణు సహస్ర నామాలు వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది.