Actress samantha : ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులందరినీ మాయ చేసిన సమంత గురించి తెలియని వారుండరు. అయితే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల విషయాలపై విపరీతమైన చర్చలు జరిగేవి. అయితే సామ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆథ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్ ను చెప్పడమే ఇందుకు కారణం.
నేను మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడం లేదని, ఏమీ మాట్లాడడం లేదా తప్పు అంగీకరించానని, నా దయా హృదయాన్ని బలహీనత అని మీరు పొరపడొద్దు. దయకూ ఓ ఎక్సై పైరీ డేట్ అంటుంది అనే మాటలతో ఓ ట్వీట్ చేసింది. దాంతో ఎవరిని ఉద్దేశించి సామ్ ఇళా ట్వీట్ పెట్టిందంటూ నెటిజెన్లు తలలు పట్టుకుంటున్నారు. ఆథ్యాత్మిక చింతనతో అలా పెట్టిందని కొందరు అంటుండగా.. ఓ నెటిజెన్ ట్రోల్ వల్లే ఇలా పెట్టిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.