...

Vijay: కేవలం ఆ ఒక్క ఘటనతో పది సంవత్సరాలు మీడియాకు దూరమయ్యా… విజయ్ షాకింగ్ కామెంట్స్!

Vijay: తమిళ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ సినిమా 13 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గతంలో తనకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఆ సంఘటన కారణంగా మీడియాకు పది సంవత్సరాలపాటు దూరమయ్యానని చెప్పుకొచ్చారు.

అయితే తన సినిమాలతో బిజీగా ఉండటం వల్లనో, లేదా ఇతర కారణాల వలనో మీడియాకు దూరం కాలేదని కేవలం తను మీడియాతో మాట్లాడిన మాటల కారణంగా పది సంవత్సరాలపాటు మీడియాకు దూరమయ్యానని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించారు. సుమారు పదకొండు సంవత్సరాల క్రితం ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా నేను మాట్లాడిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకొని మరోలా రాసారు. ఇలా మీడియా నేను మాట్లాడిన మాటలకు బదులు మరో రాయటం వల్ల పెద్ద వివాదం చెలరేగింది.

మరుసటి రోజు ఉదయం పేపర్లో అవార్త చూసి నేను షాక్ అయ్యాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఇక నేను మాట్లాడిన మాటలను ఇంట్లో వాళ్ళకి చెప్పవచ్చు కానీ అందరికీ చెప్పడం వీలుకాదు అందుకే ఆ సంఘటన కారణంగా ఏకంగా పది సంవత్సరాల పాటు మీడియాకు దూరంగా ఉన్నానని, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ గతంలో మీడియాతో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు.