KGF Movie: కేజీఎఫ్ సినిమా తీసిన ప్రాంతం నిజమేనా.. ఇందులో నిజమెంత..?

Updated on: April 11, 2022

KGF Movie: దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేజిఎఫ్ 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అయితే ప్రేక్షకులు కోరుకున్న విధంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేజిఎఫ్ 2 సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మందికి ఈ సినిమా పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కే జి ఎఫ్ సినిమా తీసిన ప్రాంతం నిజమేనా? ఈ సినిమా కథ అక్కడ నిజంగానే జరిగిందా ? అన్న చర్చలు మొదలయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కేజీఎఫ్ ఉంది. కోలార్ నగర్ దానికి 30 కిలోమీటర్లు, బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో బంగారు తవ్వకాలు జరిగినట్లు చరిత్రను చెబుతున్నాయి. అలా 2001 నుండి ఆ ప్రదేశంలో తవ్వకాలను నిలిపి వేశారట. ఆ గనుల్లో బంగారం కూడా అంతరించి పోవడమే కారణం అని చెబుతూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే కోలార్ లో బంగారు గనులు ఉన్నట్లు చరిత్ర సారాంశం. ఇంగ్లీష్ వారితో టిప్పు సుల్తాన్ పోరాటం జరిపి కన్నుమూసిన తరువాత మైసూరు ప్రాంతం బ్రిటిష్ వారి వశం అయ్యింది. ఇక ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ అయిన జాన్ వారెన్ కోలార్ ప్రాంతం మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు.

Instagram Viral 19-Minute Videos
19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

ఇదే విషయాన్ని ఒక పుస్తకంలో కూడా రాసుకొచ్చారు. ఆ ప్రదేశంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయాలి అని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు సహాయంతో మట్టి తవ్వకాలు చేపట్టారు. ఆ విధంగా ఎక్కువ మట్టిని సేకరించగా అక్కడ తక్కువ మొత్తంలో మాత్రమే బంగారం ఉందని, చిత్రాలు అన్నీ కూడా వృధా అయిందని అక్కడితో ఆపేసారట. ఇక 1850 లో వారెన్ నా పుస్తకాన్ని లావెళ్లి అనే ఒక బ్రిటిష్ అధికారి చదివి భారతదేశంలో బంగారు తవ్వకాలను చేపట్టాలని నిర్ణయించుకుని ఇక్కడ తవ్వకాలు మొదలు పెట్టాడట. అయితే ఆ తవ్వకాల కోసం అవసరమైన విద్యుత్ కోసం ఒక భారీ పవర్ ప్లాంట్ ను కూడా అక్కడ నిర్మించారట. అక్కడ దాదాపు 30 వేల మంది కార్మికులు ఈ ఫీల్డ్ లో పని చేశారని 2001 తరువాత అక్కడ తవ్వకాలు జరగలేదని తెలుస్తోంది. అంతేకాకుండా బంగారు గనుల ప్రాంతాన్ని పంచుకోవడం కోసం వ్యక్తుల మధ్య జరిగిన పోరాటాలను అందులో వచ్చే పనిచేసే కార్మికుల జీవితాలను కేజిఎఫ్ సినిమాలో చూపించారని వార్తలు వినిపిస్తూ ఉండగా. ఆ విషయంపై స్పందించిన కేజిఎఫ్ చిత్రబృందం ఆనాటి కేజీఎఫ్ కు సినిమాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అయితే అక్కడ ఉన్న కేజిఎఫ్ అన్న పేరును మాత్రమే వాడుకున్నాడు తప్ప కేజీఎఫ్ సినిమాకు ఆ కథకు ఎటువంటి సంబంధం లేదు.

Advertisement
Realme P4x 5G
Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel