Kajal Aggarwal: ప్రస్తుత కాలంలో బేబీబంప్ ఫోటో షూట్ చేయడం ఎంతో ట్రెండీగా మారిపోయింది. ఈ క్రమంలోనే సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ బేబీ బంప్ ఫోటో షూట్ నిర్వహిస్తూ ఆ జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటారు. ఈ సమయంలోనే వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అనే విషయం మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో కాజల్అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ఇప్పటికే తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు. తాజాగా కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా బ్లాక్ కలర్ ట్రెండీ వేర్ లో బేబీ బంప్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో క్షణాల్లో వైరల్ గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి కామెంట్ లో వర్షం కురుస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఇక తన అభిమాన నటి త్వరలోనే తల్లి కాబోతుందని తెలియడంతో అభిమానులు కూడా ఈ ఫోటోలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2020 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తన ప్రెగ్నెన్సీ కారణంగా కమిట్ అయిన సినిమాల నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకొని పూర్తిగా ఇంటికే పరిమితమై తన మాతృత్వాన్ని ఎంతో ఆస్వాదిస్తోంది. ఇకపోతే ఈమె నటించిన ఆచార్య సినిమా ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.