Guppedantha Manasu : తన తల్లిని ఇంటికి ఆహ్వానించిన రిషి.. సంతోషంలో జగతి!

Guppedantha Manasu Rishi invited his mom to home jagathi is in happiness
Rishi invited his mom to home jagathi is in happiness

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు (Guppedantha Manasu Jan 25 Episode) ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మహేంద్ర, జగతికి ఫోన్ లో ఐ యాం ఓకే జగతి అని మెసేజ్ పెడతాడు. దానికి జగతి కాల్ చెయ్యనా అని రిప్లై ఇస్తుంది. ఇక మహేంద్ర పక్కనే రిషి ఉన్నాడు అని చెబుతాడు. ఆ మాటకు జగతి ఎంతో ఆనంద పడుతుంది.

ఆ తర్వాత పక్కనే పడుకున్న రిషి లేచి మహేంద్ర కు వాటర్ పట్టిస్తాడు. ఇక మహేంద్ర తన మనసులో ఉన్న బాధలు డబల్ మీనింగ్ తో రిషికి తెలియ చేస్తాడు. కానీ ఆ మాటలు రిషి కి ఏ మాత్రం అర్థం కావు. వెంటనే రిషి మహేంద్ర ను ఇలా అడుగుతాడు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలంటే? సంతోషంగా చూడాలి అంటే.. నేను ఏం చేయాలి అని అడుగుతాడు.

Advertisement
Guppedantha Manasu
Guppedantha Manasu

దానికి మహేంద్ర జగతి, నా భార్య, నా అర్ధాంగి నాకు కావాలి అన్నట్టు చెబుతాడు. ఆ మాటకు రిషి నోరు పడిపోయినట్టుగా ఏం మాట్లాడకుండా ఉంటాడు. సంతోషం అంటే ఖరీదైన కార్లలో తిరగడం కాదు. ఉదయం కాఫీ చిరునవ్వుతో అందించే నా భార్యను చూడడం అని మహేంద్ర చెబుతాడు. ఇక ఆ మాటతో అసహనం వ్యక్తం చేసిన రిషి అక్కడి నుంచి బయటకు వెళ్ళి పోతాడు.

మరోవైపు జగతి ఇంటిని సంక్రాంతి పండుగ రోజున ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తుంది. జగతి ఇంటి ముందుకు హరిదాసు వచ్చి కాసేపు హడావిడీ చేస్తాడు. దానికి కాసేపు జగతి, వసులు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఈ పండుగను అందరితో కలిసి చేసుకొనందుకు గాను కొంత బాధ పడతారు. మరోవైపు రిషి తన తండ్రి అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

అలా ఆలోచించిన రిషి ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తాడు. జగతి ఇంటికి వెళ్లి.. ఇలా అంటాడు. మా డాడీ సంతోషంగా ఉండడానికి మీరు మా ఇంటికి రావాలి మేడం అని జగతి తో అంటాడు. అంతేకాకుండా వసును కూడా రమ్మంటాడు. ఈ ఒక్క మాటతో జగతి మనసులో ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Karthika Deepam : హోటల్‌లో టేబుల్ తుడుస్తున్న డాక్టర్ బాబు.. షాక్‌లో వంటలక్క!

Advertisement