Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు (karthika deepam jan 25 episode) ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి అన్న మాటల గురించి దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తమ అత్తమామలను దీపనే స్వయంగా బాధ పెడుతుందేమో అని ఊహించు కొని బాధపడుతుంది. మరోవైపు కార్తీక్ హోటల్ యజమాని దగ్గర ఆరు వేలు అప్పు తీసుకొని వస్తాడు.

ఆలా అప్పుతీసుకుని వచ్చే క్రమంలో కార్తీక్ ఇలా ఆలోచిస్తాడు. దీప రుద్రాణి అప్పు ఎలా తీరుస్తుంది? ఒకవేళ హోటల్లో పనిచేసే వ్యక్తి దీప నేమో అని కార్తీక్ ఆలోచిస్తాడు. తర్వాత కార్తీక్ నిర్ణయం మార్చుకుని ‘నేను వెళ్ళాల్సింది రుద్రాణి దగ్గరకు కాదు మా ఇంటికి. అక్కడ ఒక వేళ ఆనంద్ ఇంట్లో ఉంటే కచ్చితంగా దీప నేను పనిచేసే హోటల్లోనే పని చేస్తుంది’. అని మనసులో అనుకోని ఇంటికి వెళ్తాడు.
ఆలా ఇంటికి వచ్చిన కార్తీక్. దీప ఒడిలో బాబును చూసి స్టన్ అవుతాడు. అప్పుడు ఆ హోటల్ యజమాని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తాడు. దీప, ఆనంద్ ను ఇంటికి తీసుకు వచ్చాను కదా బాధపడకండి అని చెబుతోంది. దాంతో కార్తీక్ దీపను రుద్రాణి వడ్డీ డబ్బులు కట్టడానికి నీకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అని అడుగుతాడు.
Karthika Deepam Jan 25 Episode : హోటల్లో డాక్టర్ బాబు.. వంటలక్క చూసేసరికి..
‘నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి. నేను పని చేసి ఇంట్లో ఓనర్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని రుద్రాణి వడ్డీ చెల్లించాను’ అని అబద్దం చెబుతుంది. మరోవైపు మోనిత తన కార్తీక్ తో కలిసి పూజ చేయించుకున్న గురించి ఆలోచించు కుంటూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు దీప దగ్గరికి వచ్చి ‘మేము ఇంటిబయట ఆడుకుంటే రుద్రాణి మనుషులు వచ్చారమ్మ మీ నాన్న జాగ్రత్త ‘ అని చెప్పారని అంటారు.
ఆ మాటకు దీప స్టన్ అవుతుంది. తరువాయి భాగంలో దీప తాను పనిచేసే హోటల్ కి వెళుతుంది. వెళ్లి అక్కడ అనుకోకుండా కార్తీక్ హోటల్లో టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉండగా దీప కార్తీక్ ను చూస్తుంది. అలా ఒక్కసారిగా చూసిన దీప ఏవండీ.. అని అక్కడే గట్టిగా ఏడుస్తుంది. ఈ క్రమంలో మరి రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
Read Also : Guppedantha Manasu: తన తల్లిని ఇంటికి ఆహ్వానించిన రిషి.. సంతోషంలో జగతి!