Karthika Deepam january 19 Today Episode : కార్తీక్, సౌందర్యని నిలదీసిన హిమ.. మోనితకు బుద్ధి చెప్పిన దీప?

Updated on: January 20, 2023

Karthika Deepam january 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప గుడిలో పూజారితో తన సమస్యలు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ ఆటోలో వెళుతూ డాడీకి మమ్మీ ని బ్రతికించుకోవడం ఇష్టం లేదా ఎందుకు మోనిత ఆంటీ చెప్పినట్టు వినడం లేదు. నిజంగానే డాడీకి మమ్మీ అంటే ఇష్టం లేదా అనుకుంటూ ఇంతలో గుడి దగ్గర కార్తీక్ కారు చూసి అక్కడే దిగి అక్కడి నుంచి లోపలికి వెళుతుంది. గుడిలో కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే దీప అక్కడికి రావడంతో పూజారికి నీ విషయం చెప్పావా అనగా చెప్పాను డాక్టర్ బాబు గుడిలో ఉన్న దేవుడే కరుణించకపోతే పూజారి మాత్రమే ఏం చేస్తాడు అని అంటుంది. అప్పుడు దీప గుండె నొప్పిగా అనిపిస్తుంది డాక్టర్ బాబు అవునా సరే ఇక్కడే ఉండు నేను సౌర్యను అక్కడి పిలుచుకొని వస్తాను ఇంటికి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Karthika Deepam january 19 Today Episode
Karthika Deepam january 19 Today Episode

ఇంతలోనే హిమ దీప దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు దీపకి గుండె నొప్పి ఎక్కువ అవడంతో ఒకసారి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో హిమ,సౌర్య కార్తీక్ అక్కడికి వచ్చి దీపను నీళ్లు కొట్టి నిద్ర లేపుతారు. సరే ఇంటికి వెళ్దాం పదండి అనగా శౌర్య నువ్వు అమ్మని పిలుచుకుని కార్ దగ్గరికి వెళ్లి నేను డాడీ ఇప్పుడే వస్తాము అని కార్తీక్ ని పక్కకు పిలుచుకొని వెళ్తుంది హిమ. నేను చెప్పింది చేస్తానని నాకు ఓటు వేయండి డాడీ అనగా దేని గురించి అనడంతో అమ్మ ప్రాణాలు కాపాడడం గురించి అనగా కార్తీక్ ఆశ్చర్యపోతాడు. నాకు మొత్తం తెలిసిపోయింది డాడీ మోనిత ఆంటీ నాకు అంత చెప్పింది అనడంతో రాక్షసి పిల్లల మనసు కూడా చెడగొడుతోంది అనుకుంటూ ఉంటాడు కార్తీక్.

Advertisement

అమ్మ ఎక్కువ రోజులు బతకడంట కదా డాడీ మరి మోనిత ఆంటీ చెప్పినట్టు చేయండి అనడంతో మోనిత ఆంటీ గురించి నీకు తెలియదమ్మా నువ్వు చిన్నపిల్లవి చెప్పిన నీకు అర్థం కాదు అనగా అవన్నీ నాకు తెలియదు కానీ చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇవ్వండి అని ఉంటుంది హిమ. అంటే అమ్మ బతకడం నీకు ఇష్టం లేదా అమ్మని నువ్వు ప్రేమించడం లేదా డాడీ అనగా ఏం మాట్లాడుతున్నావ్ హిమ అంటాడు కార్తీక్. మరి ప్రామిస్ చేయండి డాడీ అనడంతో నీకు అన్ని వివరంగా చెప్తాను అని హిమను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు దీప తన గదిలో కూర్చుని నాకు సమయం దగ్గర పడింది డాక్టర్ బాబు మనసుని మార్చాలి ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది.

నీకు బాగా ఉందా అత్తయ్య అనగా బాగానే ఉంది వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు అనడంతో ఆ వారంలోపు నేను ఉంటానో ఉండనో అంటుంది దీప. నేను ఉన్నది నాలుగు రోజులే కదా అత్తయ్య ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటాను అనగా నాలుగు రోజులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తావమ్మా అని సౌర్య అక్కడికి వస్తుంది. అదేం లేదమ్మా అనగా లేదమ్మ మీరేదో నా దగ్గర నిజం దాస్తున్నారు అని సౌర్య అనగా అదేం లేదు మనం వంట చేద్దాం పద అని అక్కడ నుంచి దీప వెళ్లిపోతారు. ఇంతలోనే హిమ అక్కడికి నానమ్మ అమ్మ హెల్త్ కండిషన్ గురించి నాకు మోనిత ఆంటీ మొత్తం చెప్పింది. ఆంటీ చెప్పినట్టు చేయండి నానమ్మ అమ్మ బతుకుతుంది కదా అనగా అది కాదు ఎలా చెప్పాలి అనడంతో అంటే నీకు కూడా అమ్మ బతకడం ఇష్టం లేదా అని అంటుంది.

ఏంటి హిమ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మీ నాన్న ఎక్కడ అని కార్తీక్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. మరొకవైపు మోనిత ఇలా ఉంటే కాదు ఏదో ఒకటి చేయాలి అనే ప్లాన్ వేస్తూ ఇక ఆఖరిగా ఒక ప్లాన్ వేయాలి అది సక్సెస్ అయ్యేలా చూడాలి అనుకుంటూ ఉంటుంది మోనిత. ఆ తర్వాత ఆ సౌందర్య కార్తీక్ దగ్గరికి వెళ్లి ఏంటి రా హిమ అలా మాట్లాడుతుంది అనడంతో నాకదే అర్థం కావడం లేదు మమ్మీ ఎలా చెప్పి నాకు చెప్పాలో అర్థం కావడం లేదు అనగా మీరేం చెప్పినా నేను వినను మోనిత అంటే చెప్పినట్టే చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హిమ. ఇంతలోనే దీప అక్కడికి వచ్చి రోజురోజుకి ఆ మోనిత ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి ఇలానే చేస్తే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎలాగైనా చేసి దాన్ని ఏదో ఒకటి చేయాలి అని కోపంతో రగిలిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.

Advertisement

మరోవైపు మోనిత కళ్ళు తెరిచి నిద్రలేచి చూసేసరికి తన బెడ్ నడిరోడ్లో ఉండడంతో నేను ఏంటి ఇక్కడ ఉన్నాను అని అనుకుంటూ ఉండగా నేనే ఇలా చేశాను అని అంటుంది అక్కడికి వస్తుంది దీప. ఏంటే నేను ఎప్పుడెప్పుడు చనిపోతానా అని ఎదురుచూసే నువ్వు నాకు గుండె ఇస్తావా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అని అంటుంది దీప. దీప చాలా ఎక్కువ చేస్తున్నావు అనడంతో నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసా అంటూ వీధిలో వాళ్ళు అక్కడికి రావడంతో వాళ్ళందరికీ చెబుతూ ఇది పెళ్లయి పిల్లలు ఉన్న నా మొగుడి వెనకాల తిరుగుతోంది డాక్టర్ చదువు చదివి ఉండి ఇలాంటి పనులు చేస్తుంది అని అందరి ముందు అవమానిస్తుంది.

ఇక చాలు దీప అనగా ఆగు నీ గురించి అందరికీ తెలియాలి కదా అని అనడంతో ఒకటి కాదు రెండు కాదు 12 ఏళ్ల నుంచి పెళ్లయిన నా భర్త వెనకాల తిరుగుతోంది ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి చెప్పండి అనగా ఏంటమ్మా ఇలాంటి పనిచేయడానికి సిగ్గుగా లేదా పెళ్లయిన మగాడి వెనకాల పడటం ఏంటి అంటూ చుట్టూ ఉన్నవారు తలా ఒక మాట అనడంతో దీప నడిరోడ్లు అందరి ముందు నన్ను అవమానిస్తావు కదా ఇంతకు రెండింతలు నిన్ను అనుభవించేలా చేస్తాను అని అంటుంది మోనిత. ఈ పొద్దు రేపు పోయే దాన్ని నన్నేం చేస్తావే, నాకు ప్రాణం మీద ఆశ ఎలాగో లేదు నిన్ను చంపే వెళ్తాను అని అంటుంది. అప్పుడు మోనిత సిగ్గు లేకుండా నేను బతికితే కార్తీక్ తోనే బతకాలి లేదంటే చావాలి కార్తీక్ లేకుండా నేను బతకలేను ఎలా అయినా కార్తీక్ ని దక్కించుకొని తీరతాను అని అంటుంది.

Read Also : Karthika Deepam january 18 Today Episode : దీప హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్న హిమ.. బాధతో కుమిలిపోతున్న సౌందర్య?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel