Gold jewellery: ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది 6 ప్యూరిటీ కేటగిరిలకు మాత్రమే వర్తిస్తుంది. 14, 18, 20, 20, 22, 23, 24 క్యారెట్ అనేవి ఇవి. అంటే 21 క్యారెట్ లేదా 19 క్యారెట్ స్వచ్ఛత కల్గిన బంగారు ఆభరణాలకు బీఐఎస్ అనేది ఉండకపోవచ్చు. లేకున్నా కూడా వీటిని విక్రయించే అవకాశం ఉండదు. అయితే ఇకపై ఇది కుదరదు. ఎందుకంటే జూన్ 1 ుంచి కొత్త రూల్ అమల్లోకి రాబోతుంది. వచ్చే నెల నుంచి జువెల్లర్స్ కచ్చితంగా హాల్ మార్క్ కల్గిన బంగారు నగలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఇఖ్కడ ప్యూరిటీతో పని లేదు.
ఏ స్వచ్ఛతతో ఉన్న బంగారానికి అయినా కచ్చితంగా హాల్ మార్క్ ఉండాల్సిందే. మినహాయింపులు ఏమీ ఉండవు. ప్రతి ఒక్క బంగారు నగకు కూడా హాల్ మార్క్ ఉండాలి. బీఐఎస్ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. 2022 ఏప్రిల్ 4 మేరకు ఒఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 జూన్ 1 నుంచి జువెల్లరీ సంస్థలు అన్నీ కూడా హాల్ మార్క్ లేనటువంటి బంగారు ఆభరణాలను విక్రయించడం కుదరదని పీఎస్ఎస్ అడ్వాకేట్స్ అండ్ సొలిటిటర్స్ మేనేజింగ్ పార్ట్ నర్ సమీర్ జైన్ తెలిపారు. 12 క్యారెట్ లేదా 16 క్యారెట్ బంగారం కొనాలని భావించినా కూడా కచ్చితంగా జువెల్లరీ సంస్థలు వీటికి హాల్ మార్క్ చేయించాల్సిందే. తర్వాతనే కస్టమర్లకు విక్రయించాలి.