Kirak RP: ఘనంగా ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ.. వీడియో వైరల్!

Kirak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వాహకులతో పలు మనస్పర్ధలు రావడం చేత ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి దూరమైన ఆర్పీ అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేశారు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమౌతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Advertisement

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం తన హోం టూర్ చేసిన సమయంలో తన గదిలో తను ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపిస్తూ తాను లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించానని త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆర్పీ తెలిపారు. అయితే ఆయన చెప్పిన విధంగానే తాజాగా తాను ప్రేమించిన లక్ష్మీప్రసన్న తో ఆర్పీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుక కోసం అత్యంత సన్నిహితులు, జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు.

Advertisement

ప్రస్తుతం ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం జరుపుకున్న ఆర్పీ త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని తన మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలిపారు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు. ఈ క్రమంలోనే ఆర్పీ చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు తన గురించి ఆరా తీస్తున్నారు. ఇకపోతే కమెడియన్ గా బుల్లితెరపై అందరినీ నవ్వించిన ఆర్పీ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వం వహించే సినిమా ఇప్పటికే ఎందుకనగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

Advertisement
Advertisement