Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Nela vakudu chettu : నేల వాకుడు మొక్క.. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తుంది తెలుసా?

Nela vakudu chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్కల్లో కంటకారి మొక్క కూడా ఒకటి. దీనిని నేల ములక, నేల వాకుడు, ముళ్ల వంగ అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు భూముల్లో, బంజరు ... Read more

By Vinod Kumar

Published on: May 26, 2022 5:30 PM

Updated on: May 27, 2022 12:17 PM

---Advertisement---

Nela vakudu chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్కల్లో కంటకారి మొక్క కూడా ఒకటి. దీనిని నేల ములక, నేల వాకుడు, ముళ్ల వంగ అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు భూముల్లో, బంజరు భూముల్లో, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతుంది. కంటకారి మొక్క ఆకులు, కాయలు, కాండం అన్నీ ముళ్లను కల్గి ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో చిగురించడం నవంబర్, డిసెంబర్ నాటికి ఈ మొక్క నుండి వంకాయల్లా ఉండే కాయలు వ్తాయి. ఊ కాయలను కూరగా చేసుకొని కూడా తింటుంటారు.

ఈ చెట్టు పూలు నీలి రంగులో, ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను తాకడం కష్టమైనప్పటికీ ఎన్నో ఔషధ గుణఆలను కల్గి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వేరు కూడా ఔషధ గుణాలను కల్గి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. పేను కొరుకుడును నయం చేయడంలో నేల వాకుడు మొక్క కాయలు ఎంతో ఉపయోగడుతాయి. ఈ మొక్క కాయలను దంచి వాటి నుండి రసాన్ని తీసి దానికి తేనెను కలిపి పేను కొరుకుడుకై రాయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఆ ప్రాంతంలో మళ్లీ కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి.

మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క సమూల చూర్ణాన్ని పూటకు ఆరు గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు కాయల రసాన్ని నుదిటిపై రాసుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. పాము, తేలు విషాన్ని హరించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. కంటకారి మొక్క వేరును ముద్దగా నూరి దానికి నిమ్మరసాన్ని కలిపి పాము లేదా తేలు కుట్టిన చోట ఉంచడం వల్ల విషానికి విరుగుడుగా పని చేస్తుంది.

Read Also :Uses of clove oil : అద్భుతమైన లాభాలను అందించే లవంగం నూనె.. మీరూ వాడం

Vishnu Priya : వామ్మో… అదేమీ ఊపుడు విష్ణు ప్రియ… టాపు పైకి లేపి మరీ రచ్చ? 

Rashmika mandanna : రష్మిక అందాల ఆరబోత.. టాప్ టు బాటమ్ చూపించేస్తోందిగా!
Sudigali Sudheer : పూర్తిస్థాయి యాంకర్‌గా ఈటీవీ నుంచి స్టార్‌మాకు వచ్చేసిన సుధీర్..? 

Anchor anasuya : అనసూయను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ ఒక్క వీడియోతో
Old women dance: పెళ్లిలో బామ్మ డ్యాన్స్.. ఆశ్చర్యంలో బంధువులు.. మామూలుగా లేదుగా!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.