Fans Reaction Beast Movie : మాల్ హైజాక్ డ్రామాతో రూపొందించ చిత్రం బీస్ట్. విజయ్ దళపతి హీరోగా చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఉగ్రవాదులు ఓ మాల్ లోకి చొరబడి అక్కడ ఉన్న వాళ్లను బందీలుగా చేసుకుని వారి డిమాండ్లను నెరవేర్చుకోవాలని చూస్తారు. హీరో వారి పని పడతారు. ఈ కథతో చాలా సినిమాలే వచ్చాయి. కొన్ని హిట్ కొట్టగా.. కొన్ని బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అయితే ఈ అంశాన్ని తీసుకుని సినిమా తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కథనం చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టగలగాలి. వాస్తవికంగా ఉంటేనే ప్రేక్షకుల మెప్పు పొందగలుగుతుంది.
విజయ్ అలా ఇది వరకు చేసిన తుపాకీ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో హీరో చేసే ఆపరేషన్స్ నమ్మదగ్గట్లుగా ఉంటాయి. బలమైన రచన వల్ల అడుగడుగునా వాస్తవికత ఉట్టి పడుతుంది. కానీ వాస్తవికత లేకపోవడం, ఆసక్తి రేకెత్తించే సన్నివేషాలు లేకపోవడంతో… బీస్ట్ సినిమా ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. అంతే సినిమా నచ్చకపోవడంతో విజయ్ అభిమానులే… తమిళనాడులోని ఓ థియేటర్ స్క్రీన్ ను తగులబెట్టారు. అయితే విజయ్ అభిమానులు థియేటర్ తగులబెట్టడం నచ్చని నెటిజెన్లు… వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!