Pranahitha Pushkaralu 2022 : ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ మంచిర్యాల జిల్లాలోని అర్జున గుట్ట వద్ద ఈ పుష్కరాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తుమ్మిడి హెట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ కోవా లక్ష్మి ప్రారంభించారు. అర్జునగుట్ట ఘాట్ వద్ద పుణ్య స్నానాలకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు. కిందటి సారి 2010 డిసెంబరులో నిర్వహించగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కర కళ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజూ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా. అయితే ఈసారి ప్రాణహిత పుష్కరాలకు ఎంత మంది వస్తారో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Read Also : Karthika Deepam: జ్వాలాపై కోపంతో రగిలి పోతున్న స్వప్న..దగ్గరవుతున్న నిరూపమ్, జ్వాలా..?