Devotional Tips : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా పవిత్రంగా భావించే వాటిలో తమలపాకులు కూడా ఒకటి. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా తప్పనిసరిగా తమలపాకులు ఉండాల్సిందే. ఇలా ప్రతి ఒక కార్యక్రమంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇకపోతే పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా సముద్ర గర్భం నుంచి ఉద్భవించాయని చెబుతారు.అందుకే తమలపాకులను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఇలా లక్ష్మీ స్వరూపమైన ఈ తమలపాకు చెట్టు ఇంటి దగ్గర ఉండటం వల్ల ఆ ఇంటి పై ఎలాంటి చెడు ప్రభావం, శని ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఈ తమలపాకు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండటం వల్ల మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి గ్రహదోషాలు, శని దోషాలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Read Also : Vastu Tips: తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!
ఇక ఆంజనేయస్వామికి ఇష్టమైన తమలపాకులతో ప్రతిరోజు స్వామి వారిని పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.ఇకపోతే ప్రతిరోజు తమలపాకుపై చందనంతో జైశ్రీరామ్ అని రాసి స్వామివారి పాదాలచెంత పెట్టి పూజించడం వల్ల మనపై ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా దోషాలు తొలగిపోతాయి. ఇలా స్వామివారి పాదాలచెంత పెట్టిన తమలపాకులు మరుసటి రోజు ఉదయం తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలోనూ లేదా బావిలో అయినా వేయాలి.
Read Also : Lord Shani Dev : శని దేవుడికి కోపం కలిగించే ఈ పనులు చేయొద్దు.. మీపై శని వక్రదృష్టికి సంకేతాలివే!