...

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు..!

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీ) కోటా కింద ఇచ్చే సీట్లను పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించింది కేవీఎస్​. ఈ కోటాలో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని ఎంపీలు గత కొంత కాలంగా డిమాండ్లు చేస్తున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎంపీలతో పాటు ఇతర కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Kendriya Vidyalay
Kendriya Vidyalay

ఓ వైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రద్దు చేయడం గమనార్హం. అయితే కేవీఎస్ తీసుకున్న ఈ నిర్ణయానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీలు సీట్ల సంఖ్యను పెంచమని కోరుతుండగా.. పూర్తిగా రద్ద చేయడం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలా చేయడం సరైన పద్దతి కాదంటూ వివరిస్తున్నారు.

Read Also : Extend age limit for police: యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయో పరిమితి పెంపు..!