Deepthi sunaina : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమైన దీప్తి సునయన కొద్ది కాలంలోనే తనకంటూ ఫాన్స్ ని మూటగట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న తరుణంలోనే షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపి ఇటీవల బ్రేకప్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈమధ్య ఈ బ్యూటీ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక దీప్తి సునయన తన ప్రేమ వ్యవహారాన్ని స్వస్తి చెప్పడంతో తనకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. ఇకపై ఆమె గురించి నెటిజన్లు పలువిధాల కామెంట్స్ చేస్తున్న పెద్దగా పట్టించుకోదు చాలా లైట్ తీసుకుంటుంది. ఇవన్నీ పక్కనపెట్టి అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.
Deepthi sunaina : నువ్వు చేస్తావా? నేను చేయనా? అంటూ దీప్తి సునయన రిప్లయ్..
అయితే కొందరు అభిమానులు ఆమెకు ఫన్నీ ప్రశ్నలు వేస్తే మరికొందరు చిరాకు తెప్పించే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకరు ఆమెను అందరిని ఆశ్చర్యపరిచే ప్రశ్న వేశాడు. అదేమిటంటే నువ్వు ఎప్పుడు ఆర్ ఐ పి అవుతావు అనే ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా దీప్తి సునయన నువ్వు పోయాక నేను పోతాను అని దీటుగా సమాధానం ఇచ్చింది.

ఇక ఆదివారం కూడా దీప్తి సునయన నెటిజన్ల తో సరదాగా ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చింది. మీ ఫేవరెట్ పేరు ఏంటి అని అడగగా మేఘన అని సమాధానం ఇచ్చింది. మార్నింగ్ పనికిమాలిన విషయాలను సోషల్ మీడియాలో పెడతావు వాటిని చూడలేక పోతున్నాము అంటూ ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. నన్ను నువ్వు బ్లాక్ చేస్తావా? లేకపోతే నేను చేయనా? అంటూ సమాధానం ఇచ్చింది.
మీరు మార్నింగ్ ఎందుకు అలా రన్ చేస్తారు అని అడిగిన ప్రశ్నకు త్వరలోనే ఆ సీక్రెట్ ను రివీల్ చేస్తాను అని సమాధానమిచ్చింది. మీ మీలో మీకు అసలు నచ్చని విషయం ఏమిటని ఓ నెటిజన్ అడగగా దానికి సమాధానంగా దీప్తి సునైనా నాకు చిరాకు పడడం నచ్చదని బేసిగ్గా నాకు కోపం రాదని చిరాకు మాత్రమే వస్తుందని అందుకే నా పేరుని చి రాకేశ్వర గా మార్చుకుంటాను అని సరదాగా బదులిచ్చింది.
Read Also : Deepthi Sunaina Photos : బ్లూ హాఫ్ శారీలో దీప్తి సునయన.. ఈ రేంజ్‌లో చూపిస్తే కుర్రకారు నిద్రపోయెదట్టా..!
- Bigg Boss 5 Telugu : షణ్ముక్కు షాకిచ్చిన సిరి తల్లి.. నా బిడ్డను నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలే..?
- Deepthi sunaina: ఎప్పుడు చచ్చిపోతావంటూ నెటిజెన్ ప్రశ్న.. దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన దీప్తి!
- Deepthi Sunaina Photos : బ్లూ హాఫ్ శారీలో దీప్తి సునయన.. ఈ రేంజ్‌లో చూపిస్తే కుర్రకారు నిద్రపోయెదట్టా..!















