Actress Anitha : తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనితా. ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన ఈమె.. తన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఫస్ట్ సినిమానే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలను దక్కించుకుంది. సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ తన అందం, అభినయంతో… ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ చర్చనీయాంశమైంది.
భర్తతో కలిసి నటించినప్పటికీ… నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందుకు కారణమేంటి, ఆమె ఏలాంటి యాడ్ లో నటించింది అనుకుంటున్నారా… అనిత తన భర్తతో కలిసి ఓ కండోమ్ యాడ్ లో నటించింది. పెళ్లై, పిల్లలు ఉన్న నీవు.. ఇలాంటి యాడ్ లలో నటించడం ఏంటంటూ.. నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా కండోమ్ యాడ్ లో నటించి.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!