Crime News : కానిస్టేబుల్ కూతురికి ప్రేమ వేధింపులు, హత్య కూడా!

Tamilnadu man murdered conistable daughter due to she did not love him
Tamilnadu man murdered conistable daughter due to she did not love him

Crime News : ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని అసువులు బాసింది. పట్టపగలే రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా రైలు కింద తోసి ఓ యువతిని ప్రేమోన్మాది హతమార్చాడు. ఈ దారుణ ఘట తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అయితే మృతురాలి తల్లి కానిస్టేబుల్ కూతురు కావడం గమనార్హం. గురువారం ఉదయం సెయింట్ థామస్ మౌంట్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఇదే సమయంలో తాంబరం – బీచ్ మార్గంలోని ప్లాట్ ఫాంపై ఓ యువకుడు, యువతి చాలా సేపటి నుంచి వాదులాడుకుంటున్నారు.

Tamilnadu man murdered conistable daughter due to she did not love him
Tamilnadu man murdered conistable daughter due to she did not love him

అదే సమయంలో ఆ ప్లాట్ ఫాం వైపుగా రైలు దూసుకొస్తున్న సమయంలో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు. ఒక్కసారిగా యువతిని రైలు కింద తోసి పారిపోయాడు. అక్కడున్న వారు తేరుకునే లోపే ఆ యువతి రైలు చక్రాల కింద నలిగి దుర్మరణం చెందింది. ఇక సత్యకు గత నెలలోనే నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. బాధిత యువతి మెడలో ఉన్న గుర్తింపు కార్డు ఆధఆరంగా ఆమెను ఆదంబాక్కంకు చెందిన సత్యగా గుర్తించారు.

Advertisement

అయితే సత్య తల్లి చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. నిందితుడు సతీష్.. గత కొంత కాలంగా సత్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. దీనిపై గతంలోనే సత్య పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రైలు వస్తుండగా.. పట్టాలపైకి తోసి హతమార్చి సతీష్ ఉడాయించాడు. కాగా నిందితుడి స్పెషల్ టీం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also : Viral video: బస్టాండులో బాలికను పెళ్లాడిన బాలుడు, వీడియో వైరల్!

Advertisement