...

Elon musk: ఎలన్ మస్క్ కే ఆఫర్ ఇచ్చిన రైతు.. ట్విట్టర్ ఆఫీస్ ను షిప్ట్ చేస్తాడా!

Elon musk: ఎలన్ మస్క్ ఏది అనుకున్నా కచ్చితంగా చేసి తీరతారు. ట్విట్టర్ ను కొనాలని మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అలాగే చివరికి దానిని చేజిక్కించుకున్నాడు. ఈ ప్రపంచ కుబేరుడు ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ట్విట్టర్ లో ఆ మార్పులు చేస్తాడట.. ఈ ఫీచర్లు తీసుకొస్తాడట.. ఇలాంటి సెక్యూరిటీ ఉంటుందట.. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తెస్తాడట.. అని చాలా అంశాలపైన వార్తా కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ ఉన్నారు. అయితే పరాగ్ ను ఆ సీటు నుండి తొలగించి మరో వ్కక్తికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ కొత్త వ్యక్తి ఎంపిక కూడా జరిగిపోయిందని అంటున్నారు. మరో తాజా అంశం ఆసక్తికరంగా మారింది. అదే ట్విట్టర్ ఆఫీస్ ను షిఫ్ట్ చేయడం. ఈ నేపథ్యంలో ఓ రైతు ఎలన్ మస్క్ కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కాలిఫోర్నియాలో ఉన్న ట్విట్టర్ ఆఫీస్ ను టెక్సాస్ రాష్ట్ంలోని ఆస్టిన్ నగరానికి మారిస్తే విలియంసన్ కౌంటీలో ఉన్న తన 100 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇస్తానని రైతు జిమ్ ష్వెర్ట్నర్ ట్వీట్ చేశాడు.

జిమ్ ష్వెర్ట్నర్ 1946 నుండి ఆస్టిన్ లో పశువుల్ని పెంచుతున్నాడు. అలాగే కాపిటల్ ల్యాండ్ అండ్ లైవ్ స్టాక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రైతు వద్ద 20 వేల ఎకరాల భూమి ఉంది. అయితే టెక్సాస్ లో ఉన్న ఈ ప్రాంతంలో పత్తి, మొక్క జొన్న, వరి, గోధుమల్ని ఎక్కువగా పండిస్తారు. టెస్లా ప్రధాన కార్యాలయం ఆస్టిన్ లోనే ఉంది. స్పేస్ ఎక్స్ బోకా చికా, దిబోరింగ్ కంపెనీ ఫ్లుగర్విల్లే నగరంలో ఉంది. ఊ మూుడూ ప్రాంతాలు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ట్విట్టర్ కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుండి టెక్సాస్ కు మారిస్తే కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.