Hyper Aadi : జీవితంలో ఎన్నో అనుకుంటాం, ఏమేమో చేయాలని కలలు కంటాం. కానీ ఆ కలలను మాత్రం కొందరే నిజం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఇదే చేయాలి అనుకున్న వారికి విజయం వస్తుందో, లేదో చెప్పలేం. కానీ పైకి రావడానికి ఏదైనా చేసే వాళ్లకి మాత్రం ఏదో ఒక రోజు విజయం తలుపు తడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి కోవకి చెందిన వాడే జబర్దస్త్ ఫేమ్ ఆది. ఆ ఒక్క షో తో తన జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.
ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చి, ఈ రోజు ఇన్ని కోట్ల మందిని నవ్వించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆది, ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉండే ఆది, ఇప్పుడు అవతలి వారిని మాట్లాడనివ్వకుండా చేసే పంచ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇక జబర్దస్త్ అనే కామెడీ షో అనేది ఆదిని మాత్రమే కాదు, అలా ఛాన్స్ ల కోసం తిరిగే వాల్లెందరికో ఆసరాగా నిలిచి, జీతంతో పాటు, జీవితాన్ని కూడా ఇచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ షో ద్వారానే ఒకప్పుడు మామూలు ఆదిగా ఉన్న అతను, ఇపుడు హైపర్ ఆదిగా మారి, తనకంటూ ఓ ఇమేజ్ నీ సొంతం చేసుకున్నాడు. దాంతో అతని కుటుంబం సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఒకప్పుడు అవకాశాల కోసం ఎంత ఫైట్ చేశాడో, ఎంత ఎదురు చూసాడో, ఇప్పుడు అతని కాళ్ళ దగ్గరికే ఛాన్స్ లు వచ్చి పడుతున్నాయంటే దాని వెనకాల ఆయన ఎంత కృషి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి మరి కొన్ని షో లలో అలరిస్తున్న ఆదికి, ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. దాంతో అతనికి వచ్చే పెళ్లి సంబంధాలు కూడా పెరిగి పోయాయట. కోట్లలో కట్నం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్స్ కూడా వచ్చినట్టు సమాచారం. కానీ ఆది మాత్రం వాటిలో ఒక్క దానికి కూడా ఓకే చేయనట్టు తెలుస్తోంది. దానికి కారణాలు ఏంటో తెలియదు గానీ, ఆదికి ఇంత మంచి ఆఫర్లు వచ్చినా ఇంకా ఓకే చేయట్లేదు అంటే, ప్రేమ లాంటి ఏమైనా వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని పలువురు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి హింట్ గానీ, సమాధానం గానీ చెప్పక పోయినా, ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.