RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో సినిమా విడుదలకాబోతుంది అంటే సినిమా పై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు వుంటాయో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి సినిమా విడుదల అవుతుంది అంటేనే దేశవిదేశాల్లో థియేటర్స్ కళకళలాడుతూ ఉంటాయి. బాహుబలి సినిమాతో అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదే రిపీట్ చేస్తున్నాడు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా నే కనిపిస్తోంది.
అయితే కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా జనం ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇండియా మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా మోత మోగుతోంది. ఈ క్రమంలోనే నేపాల్ లోని ఒక థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే తెలుగు సినిమా ఖ్యాతిని మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు దాటింది అని స్పష్టమవుతోంది. అక్కడి ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత స్క్రీన్ దగ్గరకు వెళ్లి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు డాన్స్ లు వేస్తున్నారు.
🤩🤩🤩🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RRRMovie https://t.co/Kb3Thhm9g6
— RRR Movie (@RRRMovie) March 27, 2022
Advertisement
సీట్లో కూర్చొని మరీ సంతోషంతో డాన్స్ లు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే అదే విధంగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కూడా హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో సముద్రఖని,అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రలో నటించారు. ఇక పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ ద్వారానే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల అయి మూడు రోజులు అవుతున్నా కూడా అన్ని థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.